Header Banner

రోహిత్, కోహ్లీ తర్వాత జడేజా.. రిటైర్మెంట్ వార్తలపై జడేజా స్పందన ఏంటంటే..

  Mon Mar 10, 2025 20:28        Sports

రిటైర్మెంట్ గురించి నిరాధారమైన ప్రచారాలు వద్దని రవీంద్ర జడేజా స్పష్టం చేశారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జడేజా తన ఓవర్ల కోటాను పూర్తి చేయగానే కోహ్లీ పరుగెత్తుకుంటూ వచ్చి ఆలింగనం చేసుకోవడంతో, జడేజా వీడ్కోలు పలుకుతారనే ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. ఈ ఊహాగానాలపై రవీంద్ర జడేజా స్వయంగా స్పందించారు. "నిరాధారమైన పుకార్లు వ్యాప్తి చేయవద్దు.. ధన్యవాదాలు" అంటూ పోస్టు పెట్టారు. తద్వారా తాను వన్డేలలో మరికొంత కాలం పాటు కొసాగుతానని పరోక్షంగా వెల్లడించారు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ట్వంటీ20లకు వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే ఈ ముగ్గురు ఆటగాళ్లు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని రోహిత్ శర్మ ఇదివరకే ఖండించారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Ravindra #Jadeja #SportsNews #Cricket